లాభాల్లో అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు

SELVI.M|
బుధవారం అంతర్జాతీయ మార్కెట్లకు కలిసొచ్చింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి లాభ, నష్టాలతో ఒడిదుడుకులను ఎదుర్కొన్న విదేశీ మార్కెట్లు బుధవారం సాయంత్రం 3.30 గంటల ప్రాంతంలో ఆశాజనకంగా ర్యాలీని కొనసాగిస్తున్నాయి. కానీ ఒక్క దేశీయ బాంబే స్టాక్ మార్కెట్‌తో మినహా అమెరికా, ఆసియా, యూరప్ మార్కెట్లు లాభదాయకంగా ర్యాలీని పయనింపజేస్తున్నాయి.

ఇందులో దేశీయ బాంబే స్టాక్ ట్రేడింగ్ ప్రారంభం నుంచి హెచ్చుతగ్గులను నమోదు చేసుకుని ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలను ఆర్జించింది. ఫలితంగా బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 120 పాయింట్లు క్షీణించి, 15,922 పాయింట్ల మార్కు వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 35 పాయింట్లు క్షీణించి 4799 పాయింట్ల మార్కు వద్ద ముగిసింది.

ఇకపోతే.. యూరప్ మార్కెట్ సూచీలైన ఎఫ్‌టీఎస్ఈ 100 14 పాయింట్ల లాభంతో, 5,126 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతుండగా, డాక్స్ సూచీ 35 పాయింట్లు బలపడి, 5,533 పాయింట్ల మార్కు వద్ద ర్యాలీని పయనింపజేస్తోంది. ఇలాగే ఆసియా మార్కెట్ సూచీలు కూడా లాభాలను ఆర్జిస్తున్నాయి. ఇందులో నికాయ్ సూచీ 31 పాయింట్ల వృద్ధితో 9,963 పాయింట్ల మార్కును తాకింది.

ఇదేవిధంగా అమెరికా స్టాక్ మార్కెట్ కూడా మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాలను నమోదు చేసుకుంది. ఇందులో డౌ సూచీ మాత్రం 150 పాయింట్లు బలపడి, 10,058 పాయింట్ల మార్కు వద్ద నిలిచింది.


దీనిపై మరింత చదవండి :