స్టాక్ మార్కెట్ సోమవారం నష్టాలతో ముగియడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 285 పాయింట్లు కోల్పోయి 8,607 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 89 పాయింట్లు నష్టపోయి 2,674 వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్... 129 పాయింట్ల నష్టంతో 8,763 వద్ద ప్రారంభమైంది. బీఎస్ఈ బ్యాంకెక్స్ 5 శాతం, మెటల్ ఇండెక్స్ 4.3 శాతం చొప్పున క్షీణించాయి. సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి మొత్తం 2,455 కంపెనీల వాటాలు ట్రేడ్ అవగా, 1,638 కంపెనీల వాటాలు నష్టపోయాయి. అలాగే 731 కంపెనీల వాటాలు లాభపడగా... మిగిలిన 86 కంపెనీల వాటాలు స్థిరంగా ముగిశాయి.