ఇంగ్లండ్‌పై గెలుపు: ప్రపంచకప్ సెమీఫైనల్లోకి ఫ్రాన్స్!

SELVI.M|
మహిళల ప్రపంచకప్ సెమీఫైనల్లోకి ఫ్రాన్స్ దూసుకెళ్లింది. ఇంగ్లండ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 4-3 పాయింట్ల తేడాతో గెలుపును నమోదు చేసుకోవడం ద్వారా సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఇంగ్లండ్‌కు 59 నిమిషంలో జిల్ స్కాట్ తొలి గోల్ సాధించగా, ఎలిస్ బుస్సాగ్లియా జిల్ గోల్‌ను రెండు నిమిషాల్లోనే సమం చేస్తూ తొలి గోల్ సాధించింది.

ఇంగ్లండ్‌కు చెందిన క్లారే రఫెర్టీ, ఫయే వైట్‌లు పెనాల్టీలను చేజార్చుకోవడం ద్వారా ఫ్రాన్స్ చేతిలో ఖంగుతింది. పెనాల్టీ కార్నర్‌లను గోల్‌గా మలచలేని ఇంగ్లండ్‌కు క్వార్టర్స్‌లో చేదు అనుభవమే ఎదురైంది.

తద్వారా ఫ్రాన్స్ క్రీడాకారిణుల దూకుడు బ్రేక్ వేయలేకపోయిన ఇంగ్లండ్‌కు పరాభవం తప్పలేదు. కాగా, ఫ్రాన్స్ తన తదుపరి మ్యాచ్‌లో బ్రెజిల్ లేదా అమెరికాతో తలపడనుంది. ఈ మ్యాచ్ జూలై 17వ తేదీన జరుగనుంది.


దీనిపై మరింత చదవండి :