డేవిస్ కప్‌ రెండో రౌండ్లో రోజర్ ఫెదరర్ శుభారంభం!

SELVI.M|
డేవిస్ కప్ టెన్నిస్ టోర్నమెంట్లో స్విజ్ మాస్టర్ రోజర్ ఫెదరర్ శుభారంభం చేశాడు. వింబుల్డన్ టోర్నమెంట్లో ఆశించిన మేరకు రాణించలేకపోయిన రోజర్ ఫెదరర్, పోర్చుగీస్‌కు చెందిన మంచెడోను మట్టికరిపించాడు. 90 ర్యాంకులు వెనకబడిన మచాడోపై 5-7 6-3 6-4 6-2 పాయింట్ల తేడాతో రోజర్ ఫెదరర్ గెలుపును నమోదు చేసుకున్నాడు.

రోజర్ ఫెదరర్ విజయంతో స్విట్జర్లాండ్ 2-0 ఆధిక్యంతో నిలిచింది. ఆద్యంతం మెరుగ్గా రాణించిన రోజర్ ఫెదరర్ 14 బ్రేక్ పాయింట్లతో విజయం సాధించాడు. తొలి రౌండ్ మ్యాచ్‌లో స్టానిస్లాస్ వార్వింకా ఫ్రెడ్‌రికో గిల్‌పై విజయం సాధించగా, రెండో రౌండ్లో రోజర్ ఫెదరర్ రుయ్ మచాడోను మట్టికరిపించాడు.


దీనిపై మరింత చదవండి :