నోవాక్ జకోవిచ్, కరోలిన్ వోజ్నియాకీలకు టైటిళ్లు!

SELVI.M|
FILE
ఏటీపీ, దుబాయ్ టెన్నిస్ టోర్నమెంట్లో సెర్బియా వీరుడు నోవాక్ జకోవిచ్, డెన్మార్క్ క్రీడాకారిణి కరోలిన్ వోజ్నియాకీలకు సింగిల్స్ టైటిల్స్ గెలుచుకున్నారు. దుబాయ్‌లో జరిగిన దుబాయ్ ఏటీపీ టెన్నిస్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో జకోవిచ్ 6-3, 6-3 తేడాతో ప్రపం చరెండో ర్యాంక్ ఆటగాడు రోజర్ ఫెదరర్‌పై సంచలన విజయం సాధించాడు. జోకొవిచ్ షాట్లకు ఏ దశలోనూ ధీటుగా ఎదుర్కోలేని ఫెదరర్ రన్నరప్‌గా నిలిచాడు.

ఇక దోహలో జరిగిన కతార్ డబ్ల్యూటీఏ ఫైనల్‌లో కరోలిన్ వోజ్నియాకీ 6-4, 6-4 ఆధిక్యంతో రష్యాకు చెందిన వెరా జొనరెవాను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన వొజ్నియాకి అందరి అంచనాలకు తగినట్టుగానే పోరాటం కొనసాగించింది. ప్రత్యర్థిని భారీ షాట్లతో కట్టడి చేయడంలో వోజ్నియాకీ సఫలమైంది. తద్వారా కతార్ ఓపెన్ సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకుంది.


దీనిపై మరింత చదవండి :