సచిన్‌కు నాలుగు అడుగుల దూరంలో రికీ

PNR| Last Modified శుక్రవారం, 10 జులై 2009 (19:18 IST)
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ టెస్టు రికార్డుకు ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ మరో నాలుగు అడుగుల దూరంలో ఉన్నాడు. ప్రపంచంలో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్‌గా సచిన్ టెండూల్కర్‌కు రికార్డు ఉంది. తన రెండు దశాబ్దాల క్రికెట్ కెరీర్‌లో సచిన్ 42 (నాటౌట్) సెంచరీలు చేసి, అగ్రస్థానంలో ఉన్నాడు.

అయితే, ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ ఈ రికార్డుకు మరో నాలుగు అడుగుల దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ తొలి టెస్టులో సెంచరీ చేశాడు. ఇది తనకు వ్యక్తిగతంగా 38వ సెంచరీ.

మొత్తం 224 బంతులను ఎదుర్కొన్న రికీ పాంటింగ్, 14 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 150 పరుగులు చేసి, ఇంగ్లండ్ స్పిన్నర్ మాంటీ పనేసర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుత ఫామ్‌ను కొనసాగించిన పక్షంలో రికీ పాంటింగ్ యాషెస్ సిరీస్‌లోనే సచిన్ రికార్డును అధిగమించే అవకాశం ఉన్నట్టు క్రికెట్ పండితులు చెపుతున్నారు.


దీనిపై మరింత చదవండి :