ఆదివారం నుంచి సబ్ జూనియర్ నేషనల్ బాక్సింగ్!

SELVI.M|
ఒలింపిక్ పోటీలకు సన్నాహకంగా రెండో జూనియర్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ పోటీలు ఆదివారం (జూలై 14) నుంచి ప్రారంభం కానున్నాయి. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జేసీటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గ్రౌండ్స్‌లో ఈ టోర్నీ జరుగుతుందని తమిళనాడు బాక్సింగ్ అసోసియేషన్ (టీఎన్‌బీఏ) కోశాధికారి గోవిందరాజ్ అన్నారు.

బాలికల కోసం నిర్వహించే ఈ టోర్నీలో వయోపరంగా మ్యాచ్‌లు జరుగుతాయి. 11, 12, 13 ప్లస్‌ల్లో వివిధ కేటగిరీల్లో పోటీలుంటాయని గోవిందరాజన్ వెల్లడించారు. అన్ని జిల్లాలకు చెందిన క్రీడాకారిణులు ఈ టోర్నీలో పాల్గొంటారు. ఒక జిల్లాకు పది బాక్సర్ల చొప్పున 360 మంది బాక్సర్లు ఈ టోర్నీ బరిలోకి దిగుతారు.


దీనిపై మరింత చదవండి :