ఆసియా-ఓషియానియా గ్రూపు-1 డేవిస్ కప్ రెండో రౌండ్‌లో పోటీలు మార్చి ఆరో తేదీ నుంచి జరుగనున్నాయి. ఈ పోటీల్లో భారత జట్టు చైనీస్ తైపీతో తలపడనుంది. ఈ పోరు కోసం భారత డేవిస్ కప్ జట్టు ఆదివారం ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్లింది. మొదటి రౌండ్‌లో భారత్‌కు బై లభించగా, చైనీస్ తైపీ జట్టు కజకిస్థాన్‌ను ఖంగుతినిపించింది.