సోమవారం, 9 మార్చి 2026
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 మార్చి 2026 (20:21 IST)

ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ- లక్ష్యసేన్ శుభారంభం

Lakshya Sen
Lakshya Sen
ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్ లక్ష్యసేన్ శుభారంభం చేశాడు. తొలి రౌండ్‌లోనే ఏకంగా వరల్డ్ నెంబర్ వన్ ప్లేయర్ షి యుకిను మట్టికరిపించాడు. మంగళవారం జరిగిన మ్యాచ్‌లోనే సేన్ 23-21, 19-21, 21-17 తేడాతో షి యుకి పై విజయం సాధించాడు.
 
తొలి రౌండ్లోనే ప్రపంచ నెం.1 ప్లేయర్‌ను ఎదుర్కొన్నప్పటికీ సేన్ పట్టుదలతో రాణించాడు. చైనా ప్లేయర్ గట్టిపోటీనే ఇచ్చాడు. గంటా 18 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో చివరికి విజయం సేన్‌నే వరించిది. దీంతో అతను రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. ఇక ఉమెన్స్ సింగిల్స్‌లో భారత్‌కు నిరాశ ఫలితాలే వచ్చాయి.