ఆదివారం, 2 నవంబరు 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 సెప్టెంబరు 2025 (23:33 IST)

Djokovic: యుఎస్ ఓపెన్ క్వార్టర్స్‌లో జకోవిచ్ స్టెప్పులు.. నేర్పింది ఎవరో తెలుసా? (video)

Djokovic
Djokovic
యుఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్‌లో టేలర్ ఫ్రిట్జ్‌ను ఓడించిన తర్వాత, నోవాక్ జకోవిచ్ తన కుమార్తె తారా నేర్పించిన హిట్ సినిమా కెపాప్ డెమన్ హంటర్స్ నుండి కొన్ని డ్యాన్స్ స్టెప్పులేస్తూ తన గెలుపును సెలెబ్రేట్ చేసుకున్నాడు. ఈ డ్యాన్స్‌‍ను జకోవిచ్‌కు అతని 8 ఏళ్లు నిండిన తన కుమార్తె తారా నేర్పింది. 
 
క్వార్టర్ ఫైనల్‌లో 6-3, 7-5, 3-6, 6-4 తేడాతో విజయం ముగిసిన తర్వాత, జకోవిచ్ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 24 సార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్ అయిన ఈ విజయాన్ని ఫ్లషింగ్ మెడోస్‌లో లేని తారాకు ఒక పెద్ద బహుమతిగా అంకితం చేశాడు. 
 
బుధవారం జకోవిచ్ మ్యాచ్ చూసినప్పుడు తారా అతని మ్యాచ్ ఆడిన విధానానికి రేటింగ్ ఇస్తుందట. మ్యాచ్ విజయానంతరం తాను వేసిన స్టెప్పులు తన కుమార్తె తనకు నేర్పించిందని.. ఇందుకోసం ఇంట్లో కొరియోగ్రాఫ్ కూడా చేశామని జకోవిచ్ తెలిపాడు.