శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 28 ఆగస్టు 2015 (12:22 IST)

ప్రేమలోనూ సెరెనా విలియమ్స్: డ్రేక్‌తో సన్నిహితంగా ఫోటోలు

టెన్నిస్‌లో జోరు పెంచిన ప్రపంచ నెంబర్‌వన్ సెరెనా విలియమ్స్ ప్రేమలోనూ అదే తంతును కొనసాగిస్తోంది. అమెరికా ప్రపంచ నెంబర్‌వన్ సెరెనా విలియమ్స్.. తాజాగా సిన్సినాటీలోని ఓ రెస్టారెంట్లో ప్రియుడు డ్రేక్‌తో సన్నిహితంగా ఉన్న చిత్రాలు టెన్నిస్ అభిమానుల్లో ఆసక్తి రేపుతున్నాయి. వీరిద్దరూ ముద్దులు, కౌగిలింతలు చూశాక వీళ్లిద్దరు మళ్లీ ఒక్కటయ్యారని అందరూ అనుకుంటున్నారు. 
 
కాగా సెరెనా విలియమ్స్, కెనడాకు చెందిన గాయకుడు డ్రేక్‌ 2011లో కొంతకాలం డేటింగ్‌ చేసిందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో విడిపోయినా స్నేహితులుగా కొనసాగారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత జంటగా విహారం చేస్తున్నారు. సెరెనా ఆడే ప్రతి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీకి డ్రేక్‌ హాజరవుతుండటం గమనార్హం. ప్రస్తుతం ప్రేమలో జోరు పెంచిన సెరెనా డ్రేక్‌తో పెళ్లి వరకు వస్తుందో లేదో వేచి చూడాలి.