గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 3 జులై 2015 (11:04 IST)

ప్రపంచకప్ ఫుట్‌బాల్ : ఇంగ్లండ్ అవుట్, ఫైనల్లో అమెరికా-జపాన్ ఢీ

మహిళల ప్రపంచకప్ ఫుట్ బాల్ పోటీల్లో ఫైనల్లోకి ప్రవేశించాలనే ఇంగ్లండ్ జోరుకు బ్రేక్ పండింది. మరో 3 నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా ఆ దేశ క్రీడాకారిణి లారా బాసెట్ లక్షలాది మంది అభిమానుల ఆశలను నీరు గార్చింది. సొంత జట్టు ఓడిపోయేందుకు కారణమై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్, జపాన్ జట్లు పోటీ పడగా, నిర్ణీత 90 నిమిషాల్లో 1-1తో స్కోరు సమంగా ఉంది. 
 
అదనంగా ఇచ్చిన ఇంజూరీ సమయం మరో మూడు నిమిషాల్లో ముగుస్తుందనగా, డిఫెండర్ బాసెట్ సెల్ఫ్ గోల్ చేసి జట్టు పయనానికి బ్రేక్ వేసింది. దీంతో 2-1తో డిఫెండింగ్ ఛాంపియన్ జపాన్ మళ్లీ ఫైనల్ చేరుకుంది. దీంతో బాసెట్‌పై అభిమానులు మండిపడ్డారు. ఇకపోతే ఫైనల్ పోరు ఆదివారం జరుగనుంది. ఈ పోరులో వరుసగా రెండోసారి అమెరికాతో జపాన్‌ ఢీకొట్టబోతోంది.