సంబంధిత వార్తలు
- టీమ్ యూఎస్ఏ వరల్డ్ కప్ గెలిస్తే.. చంద్రుడిపైకి ఫుట్‌బాల్‌ను పంపిస్తాం.. నాసా ప్రకటన
- గ్లోబల్ ర్యాలీ రేసింగ్‌లో 10 ఏళ్ల అద్భుత ప్రస్థానాన్ని జరుపుకుంటున్న హీరో మోటోస్పోర్ట్స్ టీమ్ ర్యాలీ
- Smriti Mandhana: స్మృతి మంధానకు టైమ్ మ్యాగజైన్లో చోటు
- ఫిఫా వరల్డ్ కప్.. రాత్రికి రాత్రే హీరో అయిన గోల్ కీపర్ కాబో వెర్డే
- ఆకాశంలో ఢీకొన్న రెండు హెలికాఫ్టర్లు : పాప్ సింగర్‌తో సహా ఆరుగురి దుర్మరణం
ఫిఫా వరల్డ్ కప్ : నార్వే చేతిలో బ్రెజిల్ ఘోర పరాజయం - నేమార్ రిటైర్మెంట్
న్యూజెర్సీ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ రౌండ్ ఆఫ్ 16 పోరులో భాగంగా, ఆదివారం జరిగిన మ్యాచ్‌లో నార్వే చేతిలో బ్రెజిల్ 2-1 తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ దారుణ ఓటమి తర్వాత బ్రెజిల్ స్టార్ పుట్‌బాల్ ఆటగాడు నేమార్ అంతర్జాతీయ ఫుట్‌బాల్ రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే 34 ఏళ్ల నేమార్ భావోద్వేగానికి గురవుతూ.. తన 16 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు వెల్లడించాడు. 'సెలెకావో' (బ్రెజిల్ జట్టు)తో తన ప్రయాణం ముగిసిందని స్పష్టంచేశాడు.
ఈ ఉత్కంఠభరిత మ్యాచ్ నార్వే ఆటగాడు ఎర్లింగ్ హాలాండ్ చివరి నిమిషాల్లో వరుసగా రెండు గోల్స్ చేసి బ్రెజిల్‌కు గట్టి షాక్ ఇచ్చాడు. స్టాపేజ్ టైమ్‌లో నేమార్ పెనాల్టీని గోల్‌గా మలిచినప్పటికీ బ్రెజిల్‌కు ఓటమి తప్పలేదు. మ్యాచ్ అనంతరం నేమార్ మాట్లాడుతూ.. "నేను ఎంతో ప్రయత్నించాను. కానీ ఇక అంతా ముగిసింది. నేను ఇక్కడే ప్రారంభించాను, ఇక్కడే ముగించాను" అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
గాయంతోనే వరల్డ్ కప్‌కు వచ్చిన నేమార్.. ఆరంభ మ్యాచ్‌లో దూరమయ్యాడు. ఆ తర్వాత కోచ్ కార్లో అన్సెలొట్టి వ్యూహాల్లో భాగంగా స్కాలాండ్, నార్వే మ్యాచ్లలో సబ్‌స్టిట్యూట్ మైదానంలోకి వచ్చాడు. బ్రెజిల్ జెర్సీలో పెనాల్టీ రూపంలో అతడు చేసిన చివరి గోల్ కేవలం ఓదార్పుగానే మిగిలిపోయింది. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ నిలిచిన బ్రెజిల్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
