శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 7 నవంబరు 2015 (11:39 IST)

రియో ఒలింపిక్సే టార్గెట్: ప్రపంచ బాక్సింగ్‌ బరిలోకి భారత బాక్సర్లు

రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే లక్ష్యంగా భారత బాక్సర్లు రెడీ అవుతున్నారు. ఈ మేరకు ప్రపంచ బాక్సింగ్ పోటీల్లో సత్తా చాటాలనుకుంటున్నారు. మంగళవారం ప్రారంభమయ్యే టోర్నీలో దేవేంద్రో సింగ్‌ (49 కేజీలు), మదన్‌లాల్‌ (52 కేజీలు), శివ థాపా (56 కేజీలు), మనోజ్ కుమార్‌ (64 కేజీలు), వికాస్‌ కృష్ణన్‌ (75 కేజీలు), సతీష్‌ (91 కేజీలపైన) పోటీపడుతున్నారు. వికాస్‌, శివ థాపా, దేవేంద్రో, మనోజ్‌.. ఒలింపిక్‌ బెర్తులతో పాటు పతకాలు గెలుస్తారని క్రీడా పండితులు ఆశిస్తున్నారు. 
 
ఇకపోతే, 2011 టోర్నీలో వికాస్‌ కాంస్యం నెగ్గాడు. ఇటీవలే ఆసియా ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలిచిన అతను ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. ఈ విభాగంలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన బాక్సర్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధించుకున్న సంగతి తెలిసిందే. 91, 91 పైన కేజీల విభాగాల్లో స్వర్ణం గెలిచిన వారికే ఒలింపిక్‌ బెర్తు దక్కుతుంది.