గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 9 జులై 2016 (14:32 IST)

పిజ్జా పోల్ ఎక్కేందుకు అభినవ్ బింద్రా బీజింగ్‌లో పసిడి గెలుచుకోవడానికి లింకుందా?

పిజ్జా పోల్ ఎక్కేందుకు అభినవ్ బింద్రా ఒలింపిక్స్‌లో పసిడి గెలుచుకోవడానికి లింకుందా? అంటే అవునని షూటర్ అభినవ్ బింద్రా చెప్తున్నాడు. జర్మనీ సైనికులు తమ భయాన్ని పోగొట్టుకునేందుకు 40 అడుగుల ఎత్తుగల పిజ్జా

పిజ్జా పోల్ ఎక్కేందుకు అభినవ్ బింద్రా ఒలింపిక్స్‌లో పసిడి గెలుచుకోవడానికి లింకుందా? అంటే అవునని షూటర్ అభినవ్ బింద్రా చెప్తున్నాడు. జర్మనీ సైనికులు తమ భయాన్ని పోగొట్టుకునేందుకు 40 అడుగుల ఎత్తుగల పిజ్జా పోల్‌పైకి ఎక్కుతూ ఉంటారు. అలాంటిది 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో షూటర్ వ్యక్తిగత స్థాయిలో స్వర్ణం గెలుచుకుని ఏకైక భారతీయుడిగా రికార్డు సృష్టించాడు.

అప్పట్లో 26 ఏళ్ళ వయసున్న బింద్రాకు సరిగ్గా ఫైనల్ పోటీ ముందు చాలా భయమేసిందట. అంతే జర్మనీ సైనికుల్లా బింద్రా కూడా పిజ్జా పోల్ ఎక్కేశాడట. ఈ విషయాన్ని బింద్రా రాసిన ‘మై ఒలింపిక్ జర్నీ’ పుస్తకంలో వివరించారు. 
 
ఈ పిజ్జా పోల్ మ్యూనిచ్‌లో ఉంది. ఈ పోల్‌ను సగం ఎక్కిన తర్వాత ఇక నా వల్ల కాదని బింద్రా అనుకున్నాడట. సరిగ్గా ఇటువంటి భయాన్నే పోగొట్టుకోవాలని మళ్లీ పోల్ ఎక్కేశాడని.. చివరికి 40 అడుగుల ఎత్తుకు చేరుకున్నాడని.. ఆ తర్వాత పైనున్న ప్లాట్‌ఫారంపై సేద తీరుతూ గొప్ప ఉపశమనాన్ని, అనుభూతిని పొందాడని.. ఈ పిజ్జా పోల్ ఎక్కడమే తనలో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని.. అభినవ్ బింద్రా చెప్పాడు.