శుక్రవారం, 6 మార్చి 2026
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 జనవరి 2026 (10:21 IST)

హోటల్ గదిలో మహిళా షూటర్‌పై కోచ్ అత్యాచారం...

Victim
జాతీయ స్థాయి షూటింగ్ క్రీడలో తీవ్ర కలకలం చెలరేగింది. 17 యేళ్ల జాతీయ స్థాయి మహిళా షూటర్‌పై లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలపై జాతీయ పిస్టల్‌తో కోచ్ అంకుశ్ భరద్వాజ్‌పై హర్యానా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అతడిని తక్షణమే అన్ని బాధ్యతలు నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. 
 
బాధితురాలిని కుటుంబం ఫిర్యాదు ప్రకారం, న్యూఢిల్లీలోని డాక్టర్ కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్‌లో జాతీయ స్థాయిలో పోటీలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫరీదాబాద్‌లోని ఓ హోటల్‌ అథ్లెట్ పనితీరును విశ్లేషిస్తానని చెప్పి, భరద్వాజ్ ఆమెను తన గదికి పిలిపించి లైంగికదాడికి పాల్పడ్డాడని వారు ఆరోపించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే కెరీర్ నాశనం చేస్తానని, కుటుంబాన్ని ఇబ్బంది పెడతానని బెదిరించినట్టు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
ఈ ఫిర్యాదుతో ఫరీదాబాద్ ఎన్.ఐ.టి.లోని మహిళా పోలీస్ స్టేషన్ మంగళవారం ఎఫ్ఐఆర్ నవంబరు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టంలోని సెక్షన్ 6, బీఎన్ఎస్ 351(2)కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. కేసు తీవ్రత దృష్ట్యా, హోటల్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను వెంటనే అందించాలని యాజమాన్యాన్ని కోరాం. ఆరోపణలను నిర్దారించుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశాం అని ఫరీదాబాద్ పోలీస్ పీఆర్వో యశ్‌పాల్ యాదవ్ తెలిపారు. కాగా, ఈ విషయం మీడియా ద్వారా తెలిసిందని విచారణ పూర్తయ్యే వరకు కోచ్‌ అంకుశ్‌ను సస్పెండ్ చేస్తున్నామని అతనికి ఎలాంటి కొత్త బాధ్యతలు అప్పగించబోమని ఎన్.ఆర్.ఏ.ఐ సెక్రటరీ జనరల్ పవన్ కుమార్  సింగ్ స్పష్టం చేశారు.