బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 12 జూన్ 2016 (16:20 IST)

ఆస్ట్రేలియన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్: ఫైనల్లో సైనా నెహ్వాల్ విజయకేతనం

భారత స్టార్ ప్లేయర్, హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తన సత్తా ఏంటో నిరూపించుకుంది. తద్వారా భారత కీర్తి పతాకను విదేశీ గడ్డపై విజయంతో ఎగురవేసింది. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ బ్యాడ్మింటన్ ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్లో ప్రత్యర్థికి చుక్కలు చూపించింది. ఆద్యంతం మెరుగైన ఆటతీరును ప్రదర్శించి గెలుపును నమోదు చేసుకుంది. 
 
మహిళల సింగిల్స్ ఫైనల్ పోరులో చైనా క్రీడాకారణి సున్ యుపై సైనా నెహ్వాల్ విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభం నుంచే ఆద్యంతం మెరుగైన ఆటతీరును ప్రదర్శించిన సైనా.. పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తద్వారా 11-21, 21-14, 21-19 పాయింట్ల తేడాతో సైనా గెలుపొందింది. ఇకపోతే.. ఈ ఏడాది బ్యాడ్మింటన్ సీజన్లో సైనా నెహ్వాల్‌కు ఇదే తొలి టైటిల్ కావడం గమనార్హం. గతంలో 2014లోనూ సైనా నెహ్వాల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకుని తన సత్తాను నిరూపించింది.