బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 9 సెప్టెంబరు 2015 (12:47 IST)

యూఎస్ ఓపెన్: అక్క సెరెనాదే విజయం.. వీనస్ విలియమ్స్ ఓటమి

ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్‌లో ఆసక్తికరంగా సాగిన సిస్టర్స్‌ పోరులో అక్క సెరెనా విలియమ్స్‌దే పైచేయిగా నిలిచింది. దీంతో ఈ ఏడాది సెరెనా-వీనస్ విలియమ్స్‌ల మధ్య జరిగిన రెండో మ్యాచ్‌లోనూ చెల్లినే విజయం వరించినట్లైంది. సింగిల్స్ మహిళల క్వార్టర్ ఫైనల్‌లో హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో సెరెనా విలియమ్స్ సునాయాసంగా గెలుపును నమోదు చేసుకుంది. 
 
మూడు సెట్ల పాటు సాగిన మ్యాచ్‌లో సెరెనా విలియమ్స్ 6-2, 1-6, 6-3 స్కోరుతో వీనస్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విజయంతో సెరెనా విలియమ్స్ యూఎస్ ఒపెన్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తద్వారా టైటిల్‌కు మరో రెండడుగుల దూరంలో నిలిచింది. ఈ టైటిల్‌ను కూడా చేజిక్కించుకుంటే సెరెనా విలియమ్స్ ఈ ఏడాదిలో నాలుగు గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకుని రికార్డు సృష్టించింది. ఇకపోతే.. సెరెనా సెమీఫైనల్లో 43వ ర్యాంక్ రాబెర్టా విన్సీతో తలపడనుంది. రాబెర్టా విన్సీ యూఎస్ ఓపెన్ నాలుగు మ్యాచ్‌ల్లోనూ ప్రత్యర్థులకు చుక్కలు చూపించింది.