శ్రీరామనవమి : కంచు దీపముతో దీపారాధన చేయండి

SELVI.M|
FILE
నూనె, నిప్పు, వత్తి కలిస్తే దీపం అవుతుంది. మూడు విడివిడిగా ఉంటే మూండింటికీ పరస్పరం విరోధమే. తైలానికి అగ్నితో, వత్తితో అలాగే అగ్నికి, వత్తికి కూడా విరోధం మూడూ కలిస్తేనే దాని ఉపయోగం. విడివిడిగా ఉంటే విరోధపడేవి కలిసి ప్రమిదలో ఉన్నప్పుడు చుట్టూ ఎటు చూసినా కాంతిని నింపుతాయి.

సృష్టి దానిలోని జీవకోటి రాజస, సాత్త్విక, తామస గుణాలతో కూడినవి, ప్రమిదలో వత్తిలాంటి సత్త్వగుణము. నూనెలాంటిది తమోగుణం. మంటలాంటిది రజోగుణం. ఇవన్నీ ఒకటికొకటి గిట్టని గుణాలు.

కాని మూడు కలిస్తే కాంతి నిండుతుంది. మంచిమనిషిగా ఉండాలనుకున్న వారు రజస్, తమోగుణాలని అణచివేసి సత్త్వగుణం ఎక్కువగా అలవరుచుకోవాలి. అప్పుడా వ్యక్తి జీవితం కాంతిమయమవుతుంది. రాగద్వేషాల్ని ఎప్పటికప్పుడు వదిలించుకుంటే రజోగుణం నశిస్తుంది.

అందుచేత శ్రీరామనవమి రోజున కొబ్బరినూనెను ఉపయోగించి కంచు దీపముతో దీపారాధన చేయడమే గాకుండా ఇంటి ముందర వెలిగిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు అంటున్నారు. మరి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.


దీనిపై మరింత చదవండి :