నేడు కృష్ణాష్టమి. శ్రీకృష్ణుని జన్మదినం. ఆ పరమాత్మ జననం తోటిదే లోకం పావనమయింది. ఇంకా కలుపు మొక్కల్లా భువిపై సంచరిస్తున్న అసురులను సంహరించి లోక కల్యాణం కోసమే ఆ శ్రీకృష్ణ పరమాత్మ అవతరించాడు. శ్రీకృష్ణావతారంలో కృష్ణపరమాత్మ ఎంతోమంది కష్టాలను తొలగించడమే కాకుండా మరెందరి భవబంధ విముక్తులను చేయడానికి పూనుకున్నాడు. మునుపు రామావతారంలో ఎంతోమందికిచ్చిన వాగ్దానాలు, వరాలు శ్రీకృష్ణునిగా తీర్చడం జరిగింది.