ఐసీసీ ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా సోమవారం ట్రెండ్‌బ్రిడ్జ్‌లో జరిగిన ప్రాక్టీసు మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 38 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. మ్యాచ్‌లో విజయం చివరకు ఆసీస్ పక్షానే నిలిచినప్పటికీ బంగ్లాదేశ్ గెలిచినంత పనిచేసింది. 220 పరుగుల లక్ష్యంతో దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ ఆస్ట్రేలియా బౌలర్లకు చెమటలు పట్టించారు.