1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. 20-Year-Old Sentenced To 20 Years In Jail And Rs 50,000 Fine For Raping 4-Year-Old

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం.. 20 ఏళ్ల యువకుడికి 20 జైలు శిక్ష

Jail
పోస్కో చట్టం, అత్యాచార కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన ఫాస్ట్-ట్రాక్ కోర్టు, మంగళవారం నాడు చిల్కూర్ సందీప్ కుమార్ (20) అనే యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ. 50,000 జరిమానా విధించింది. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడినందుకు గాను కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. 
 
బాధితురాలికి రూ. 3 లక్షల పరిహారం చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించింది. తన స్నేహితులతో ఆడుకుంటున్న బాధితురాలిని కుమార్ మభ్యపెట్టి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. బాధితురాలు ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పగా, వారు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
మహిళా భద్రతా విభాగం డీసీపీ డాక్టర్ లావణ్య, ఏసీపీ ప్రసన్న లక్ష్మి, భరోసా ఇన్‌స్పెక్టర్ పద్మ, కేంద్ర నిర్వాహకురాలు గడుసు జ్యోతి పర్యవేక్షణలో భరోసా బృందం బాధితురాలికి, ఆమె కుటుంబానికి కౌన్సెలింగ్ అందించింది.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
కదిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గోపురంపై పిడుగు.. తిరుమలలో భారీ వర్షాలు