1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. 3-Year-Old Girl Mauled to Death by Stray Dogs in Peddapalli

పెద్దపల్లి జిల్లాలో దారుణం.. మూడేళ్ల బాలికను పీక్కుతున్న వీధి కుక్కలు

stray dog attack on girl
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో వీధికుక్కలు స్వైర విహారం సృష్టించాయి. మూడేళ్ల బాలికపై వీధి కుక్కలు దాడి చేసి, పీక్కుతున్నాయి. ఈ దాడిలో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మృతురాలిని దివ్యా బ్రెహ్రా అనే బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ బాలిక తమ ఇంటి ముందు వీధిలో ఆడుకుంటుండగా వీధి కుక్కలు ఒక్కసారిగా ఆ బాలికపై దాడి చేశాయి. కుక్కలు బాలికను నోట కరుచుకుని పొలాల్లోకి లాక్కెళ్లాయి. 
 
ఈ క్రమంలో కుక్కలు పీక్కుతినడంతో ఆ లబాలిక తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి తల్లిదండ్రులు ఒరిస్సా నుంచి జీవనోపాధి కోసం పెద్దపల్లికి వలస వచ్చి పని చేస్తున్నారు. తమ ప్రాంతంలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు మొత్తుకుంటున్నా అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ కారణంగానే ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. 
 
మీరు చూడ్డానికి చాలా అందంగా ఉన్నారు.. మీ వయసెంత? మహిళకు క్యాబ్ డ్రైవర్ వేధింపులు 
 
వ్యక్తిగత పనుల కోసం అత్యవసరంగా వెళ్లాలనుకునేవారు క్యాబ్‌లను బుక్ చేసుకుంటారు. ఇలాంటి క్యాబ్ డ్రైవర్లలో పలువురు కస్టమర్లతో అసభ్యంగా ప్రవర్తిస్తుంటూ వార్తలకెక్కుతుంటారు. ఈ నేపథ్యంలో ఓ క్యాబ్ డ్రైవర్ ఓ మహిళను వేధించాడు. మీరు చూడ్డానికి చాలా అందంగా ఉంటారు.. మీ వయసెంత అంటూ మెసేజ్ పంపించాడు. ఈ విషయాన్ని ఆ బాధితురాలు సోషల్ మీడియాలో వెల్లడించడంతో అది వైరల్ అయింది.
 
ఓ మహిళ కస్టమర్‌ ర్యాపిడో బుక్‌ చేసుకున్నారు. తీరా గమ్యం చేరిన తర్వాత ఆ ర్యాపిడో డ్రైవర్‌ కస్టమర్‌ ఇచ్చిన ఫోన్‌ నంబర్‌తో వాట్సప్‌లో కాంటాక్ట్‌ అయ్యాడు. అజ్ఞాత వ్యక్తిలా చాట్‌ చేయడం ప్రారంభించాడు. 'మీరు చూడ్డానికి అందంగా ఉన్నారు.. మీ వయసెంత?' అంటూ చాట్‌ చేశాడు. 
 
దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్లను ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. దీనిపై ర్యాపిడో సంస్థ స్పందించింది. ఆ డ్రైవర్‌ అనుచిత ప్రవర్తనపై క్షమాపణలు కోరింది. రిజిస్టర్డ్‌ ఫోన్‌ నంబరు, రైడ్‌ ఐడీ ద్వారా సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చింది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
రాయలసీమ మార్కెట్లో రూ.40కి చేరిన కిలో టమోటా.. రైతుల హర్షం