1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. 800 kilograms of rotten chicken seized in Hyderabad, what kind of Dum Biryani are they actually serving?

హైదరాబాదులో 800 కిలోల కుళ్లిన చికెన్ సీజ్, ఎలాంటి దమ్ బిర్యానీ పెడుతున్నార్రా అయ్యా

rotten chicken seized in Hyderabad
హైదరాబాద్ అనగానే హైదరాబాద్ దమ్ బిర్యానీ గుర్తుకు వస్తుంది. పని మీద హైదరాబాద్ నగరం వెళ్లినవారు రెస్టారెంట్లలో లొట్టలేసుకుంటూ ఈ దమ్ బిర్యానీని తినకుండా వుండరు. ఇప్పుడు అలాంటి బిర్యానీలో కుళ్లిన చికెన్ ముక్కలు వేసి తయారుచేస్తున్నారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. దీనికి కారణం... తాజాగా జిహెచ్ఎంసి, టాస్క్ ఫోర్స్ సిబ్బంది తనిఖీల్లో 800 కిలోల కుళ్లిన చికెన్ లభ్యం కావడమే.
 
సికిందరాబాదులోని పార్సీగుట్టలోని చికెన్ సెంటర్లో తనిఖీలు నిర్వహించగా ఆ షాపులో ఏకంగా 800 కిలోల చికెన్ కుళ్లిన స్థితిలో కనబడింది. ఈ చికెన్‌ను వైన్ షాపులు, రెస్టారెంట్లకు షాపు యజమాని అమ్ముతున్నట్లు తేలింది. దీనితో షాపు యజమానిపై అధికారులు కేసు నమోదు చేసారు. లైసెన్స్ గడువు ముగిసినా పట్టించుకోకుండా జోరుగా అమ్మకాలు చేస్తున్న షాపు యజమానిపై పోలీసులు కేసు నమోదు చేసారు. ఇలా కుళ్లిన చికెన్ సరఫరా చేస్తూ ఎంతమంది ప్రాణాలతో చెలగాటమాడుతున్నారోనని ఆగ్రహం వ్యక్తమవుతోంది.
తర్వాతి కథనం
టీవీకే నేత నోటిదూల.. రజనీకాంత్ ఫ్యాన్స్ విజయ్‌కి ఓటేస్తారా?