సంబంధిత వార్తలు
- Hyderabad: కుమారుడి సాయంతో ప్రియుడిని హత్య చేసింది
- ప్రియుడి కోసం బంగారు నగలు తాకట్టు పెట్టి భర్త హత్యకు రూ. 5 లక్షలు అడ్వాన్స్
- వివాహిత బ్లాక్మెయిల్ : ఫిట్నెస్ ట్రైనర్ ఆత్మహత్య... ఎక్కడ?
- ముంబైలో ఓ ముద్దు.. లిఫ్టులో 36 ఏళ్ల మహిళ ఓ వ్యక్తికి ముద్దెట్టింది.. వీడియో వైరల్
- నీ భర్తతో కన్నపిల్లల్ని నా దగ్గర వద్దన్న ప్రియుడు, ఆత్మహత్య చేసుకున్న వివాహిత
ప్రేమించి పెళ్లాడి బిడ్డను కని, ఆ బిడ్డను అమ్మేసి మరొకరితో పెళ్లికి సిద్ధమైన వివాహిత
మానవ సంబంధాలు రోజురోజుకీ క్షీణించిపోతున్నాయని తెలిపే ఘటనలు జరుగుతున్నాయి. హైదరాబాదులోని హయత్ నగర్ పోలీసు స్టేషను పరిధిలోని కొహెడ గ్రామంలో ఇలాంటి ఘటన జరిగింది. గ్రామంలో నివాసం వుండే గోవర్థన్ అనే యువకుడు నాలుగేళ్ల క్రితం సరిత అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఐతే ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పకుండా గోప్యంగా వుంచారు.
ఇద్దరూ తమ మకాన్ని మార్చేసి సిటీకి దగ్గరలో వుంటున్నారు. వీరికి ఓ బిడ్డ పుట్టింది. ఐతే గోవర్థన్ డ్యూటీకి వెళ్లగానే తమ ఇంటికి సమీపంలో వున్న మరో వ్యక్తి సరితకు దగ్గరయ్యాడు. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. విషయాన్ని పసిగట్టిన గోవర్థన్ పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు. అతడి మాటలను పట్టించుకోని సరిత.. కన్నబిడ్డను అమ్మేసి ప్రేమికుడితో వెళ్లిపోయింది.
ఈ విషయం తెలుసుకున్న గోవర్థన్ తల్లడిల్లిపోయాడు. తనతో వుండాలని బ్రతిమాలినా ఆమె పట్టించుకోలేదు. దీనితో తీవ్ర మనస్థాపానికి గురైన గోవర్థన్ ఓ సెల్ఫీ వీడియో రికార్డు చేసి తన చావుకి కారణాలు వివరించి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని యువకుడి ఆత్మహత్య
— Telugu Scribe (@TeluguScribe) May 15, 2026
నాలుగేళ్ల క్రితం ఇంట్లో తెలియకుండానే పెళ్లి చేసుకున్న ప్రేమ జంట
వీరికి పుట్టిన బిడ్డను అమ్మేసి ఇంకొకరితో పెళ్లికి సిద్ధమైన యువతి
పెళ్లి పనులు కూడా తనతోనే చేయించుకోవడంతో తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు
ఆత్మహత్య… pic.twitter.com/y5KOYYLFdW
