సినీ నటి ప్రత్యూష కేసు.. 24ఏళ్ల తర్వాత లొంగిపోయిన సిద్ధార్థ్ రెడ్డి
సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడిగా వున్న సిద్ధార్థ్ రెడ్డి తెరపైకి వచ్చాడు. 24 ఏళ్ల తర్వాత మీడియా ముందుకు వచ్చాడు. సుప్రీం కోర్టు తుది తీర్పు మేరకు సిద్ధార్థ్ రెడ్డి హైదరాబాద్ నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. ప్రత్యూష మరణం తర్వాత అమెరికాలో స్థిరపడిన సిద్ధార్థ్ రెడ్డి సుప్రీం ఆదేశాల ప్రకారం లొంగిపోవాల్సి వచ్చింది. ఈ ఘటన 2002 ఫిబ్రవరి 23వ తేదీన జరిగింది.
ప్రత్యూష మృతి తర్వాత ఆమె కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆమె తల్లి ఈ ఘటనపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది ఆత్మహత్య కాదని, హత్య జరిగి ఉండొచ్చని ఆమె ఆరోపించారు. ఈ కేసులో ట్రయల్ కోర్టు విచారణలో ఆయనను దోషిగా నిర్ధారిస్తూ ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ట్రయల్ కోర్టు తీర్పును సిద్ధార్థ్ రెడ్డి సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించాడు.
ఐదేళ్ల జైలు శిక్షను రెండు సంవత్సరాలకు తగ్గిస్తూ తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సిద్ధార్థ్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు చాలాకాలం పాటు సుప్రీంకోర్టులో విచారణలో కొనసాగింది. చివరకు సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. సిద్ధార్థ్‌రెడ్డి వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
తుది తీర్పులో భాగంగా సుప్రీంకోర్టు సిద్ధార్థ్‌రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. నాలుగు వారాల్లోగా కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ఆయన హైదరాబాద్‌కు వచ్చి నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు.