1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. ap dy cm pawan kalyan key comments in delhi on delay in identifying telangana martyrs

యువతను బలిచేసి నాయకులు అధికార పీఠాన్ని అధిరోహించారు : పవన్ కళ్యాణ్

Pawan kalyan
తెలంగాణ రాష్ట్రంలో యువతను బలిచేసి నాయకులు అధికార పీఠాన్ని అధిరోహించారని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. సోమవారం ఢిల్లీలో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 12 యేళ్లు గడుస్తున్నా, ఉద్యమ అమరవీరులను సముచితంగా గుర్తించి గౌరవించడంలో ఎందుకు జాప్యం జరుగుతోందని ఆయన ప్రశ్నించారు. 
 
తెలంగాణ ఉద్యమలో సుమారు 1200 మంది ప్రాణత్యాగం చేశారని, వారి బలిదానాలు తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని అన్నారు. ప్రజల ప్రాణత్యాగాలు చేసేంత గొప్ప నేల తెలంగాణ గడ్డ. అందుకే నాకు ఆ నేల పట్ల, అక్కడి ప్రజల పట్ల ఎంతో గౌరవం ఉందన్నారు. ఒక లక్ష్యం కోసం ఇంతమంది ఆత్మబలిదానాలు చేసుకుంటారా? అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో అమరవీరులకు నివాళులు అర్పించేందుకు తాను వెళ్లాలని భావించగా, ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని ఆయన ఆరోపించారు. 
 
యువతను బలిచేసి కొందరు నాయకులు తెలంగాణలో అధికార పీఠాన్ని అధిరోహించారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ అసలు ఆకాంక్షల సాధన కోసం జనసేన నిరంతరం శ్రమిస్తుందని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో ఉండి భవిష్యత్ ప్రయోజనాల కోసం కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఐసీఐసీఐ ప్రూ సిగ్నేచర్ సెక్యూర్: మెచ్యూరిటీ బెనిఫిట్, లైఫ్ కవర్, పన్ను ఆదా