సంబంధిత వార్తలు
- ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్గా బీఆర్ఎస్ కౌన్సిలర్
- టీఆర్ఎస్ అనే పేరు పబ్లిక్ డొమైన్లో వుంది.. కవిత పార్టీ పేరు అదేనా?
- రేవంత్ ముందు మీ ఆటలు సాగవు... బీఆర్ఎస్ సభ్యులకు సీఎం వార్నింగ్ - సభ్యుల సస్పెన్షన్
- ఫలించని బుజ్జగింపులు - 25న బీఆర్ఎస్లో చేరనున్న జీవన్ రెడ్డి!
- కాంగ్రెస్ పార్టీని వీడుతున్నా... అనుచరులతో జీవన్ రెడ్డి
బీఆర్ఎస్ను మళ్లీ టీఆర్ఎస్‌గా పేరు మార్చే అంశాన్ని పరిశీలిస్తాం : కేటీఆర్
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)ను మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)గా పేరు మార్చే అంశాన్ని పరిశీలిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సూచన ప్రాయంగా వెల్లడించారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో ఆయన పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
బీఆర్‌ఎస్‌ను మళ్లీ టీఆర్‌ఎస్‌గా మార్పు చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. తమకు పొత్తులతో కలిసిరాదని, కుదరదన్నారు. గతంలో తాము కొన్ని చిన్నచిన్న తప్పులు చేశామన్నారు. అప్పుడు ప్రజలకు నాయకులకు మధ్య దూరం పెరిగిందని, గతంలో జరిగిన తప్పులపై అధ్యయనం చేశామన్నారు. ఈ లోపాలను సరిదిద్దుకుంటామని చెప్పారు. ఈసారి వచ్చేది బీఆర్‌ఎస్సేనని.. కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
'చంద్రుడిపై కొన్ని మబ్బులు కమ్ముకున్నాయి. మబ్బులు తొలిగి చంద్రుడు మళ్లీ ఉజ్వలంగా ప్రకాశిస్తాడు. డీలిమిటేషన్‌తో తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 179కి, పార్లమెంట్ స్థానాలు 28కి పెరుగుతాయి. ఇతర రాష్ట్రాల పార్టీలు వస్తానంటే కాదనలేం. గతంలో మేం కూడా మహారాష్ట్రకు వెళ్లాం కదా. రాజకీయాల్లో డబ్బు ప్రాధాన్యత విపరీతంగా పెరిగింది. మేధావులు అనుకున్నవాళ్లు ఇప్పుడు మాట్లాడటం లేదు. నలుగురు సీఎంలు చరిత్రలో నిలిచిపోయేలా పాలించారు. వారే ఎన్టీఆర్, వైఎస్సార్, చంద్రబాబు, కేసీఆర్' అని కేటీఆర్ అన్నారు.
