తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కారు జోరుకి బ్రేకులు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మునిసిపాలిటీల పరిధిలోని 2586 వార్డులకు, 7 కార్పొరేషన్ల పరిధిలోని 414 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. శుక్రవారం నాడు కౌంటింగ్ ప్రారంభమైంది. లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ తన హవా సాగిస్తోంది. ఇప్పటివరకూ కాంగ్రెస్ 441 మునిసిపల్ వార్డులోలనూ, బీఆర్ఎస్ 236 స్థానాల్లోనూ, భాజపా 63 స్థానాల్లోనూ, ఇతరులు 75 స్థానాల్లో విజయం దిశగా సాగుతున్నారు.
మొత్తమ్మీద పుర, నగర ప్రజలు రేవంత్ రెడ్డి సర్కారుకే మొగ్గు చూపినట్లు కనబడుతోంది. 116 మునిసిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ 13 స్థానాల్లోనూ, బీఆర్ఎస్ 4 స్థానాల్లో విజయం దిశగా సాగుతున్నాయి. మధ్యాహ్నానికి ఫలితాలు దాదాపు రావచ్చు.