గురువారం, 15 జనవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 నవంబరు 2025 (18:30 IST)

చేవెళ్ల ప్రమాదంలో తల్లి మృతి.. తండ్రి, ముగ్గురు పిల్లలు బయటపడ్డారు...

Chevella Bus Accident
Chevella Bus Accident
రంగారెడ్డి జిల్లాలో పెను విషాదం సంభవించింది. చేవెళ్ల, మీర్జాగూడ సమీపంలో కంకర లోడుతో అతివేగంగా వస్తున్న టిప్పర్ లారీ.. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇప్పటివరకు 24 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. 
 
మరో 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఓ తల్లి మరణించగా, తండ్రికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారంతా క్షేమంగా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు.
 
ప్రమాదం తర్వాత సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు వారిని బస్సులో నుంచి బయటకు తీశారు. తల్లిదండ్రుల కోసం ఏడుస్తూ బిక్కుబిక్కుమంటూ ప్రమాద స్థలిలో కూర్చుండిపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.