సంబంధిత వార్తలు
- హైదరాబాద్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు హీరో కృష్ణసాయి సాయం
- భర్త కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన తాహసీల్దార్ భార్య (వీడియో)
- టీఆర్ఎస్ అనే పేరు పబ్లిక్ డొమైన్లో వుంది.. కవిత పార్టీ పేరు అదేనా?
- జగిత్యాలలో ఘోరం.. ముగ్గురు ఇంటర్ విద్యార్థులు మృతి
- సినిమాల్లో నటించాలనే ఆశతో భాగ్యనగరికి వచ్చాడు.. అంతలోనే అనంతలోకాలకు... (వీడియో)
మార్కెట్లోకి వచ్చిన డేంజరస్ మ్యాంగోస్, గోషా మహల్‌లో కల్తీ మామిడిపళ్లు
వేసవి వచ్చిందంటే మధుర ఫలం మామిడిపండ్ల కోసం ప్రజలు ఎదురుచూస్తుంటారు. మామిడిపై ప్రజలకు వున్న ఆసక్తిని క్యాష్ చేసుకునేందుకు కల్తీరాయుళ్లు వచ్చేసారు. పచ్చి మామిడికాయలకు విషపూరిత రసాయనాలను పూసి అవి పండిపోయినట్లు కనిపించేవిధంగా చేస్తున్నారు. వాటిని చూడగానే మామిడికాయ పండినట్లే కనబడుతుంది కానీ అది లోపల పచ్చిమామిడి. ఇలాంటి మామిడికాయలను అమ్ముతూ వున్న కల్తీ ముఠాను తెలంగాణ లోని గోషామహల్ మార్కెట్టులో అధికారులు పట్టేశారు. క్వింటాళ్లకొద్దీ వున్న ఈ మామిడికాయలను సీజ్ చేసారు.
పైకి పండు లోపల పచ్చి కాయ, అంత కెమికల్ మాయ
— Telangana365 (@Telangana365) April 4, 2026
మామిడి కాయలకు రసాయనాలు వేసి విషపూరితం చేస్తున్న ముఠా గుట్టు రట్టు
గోషామహల్ అడ్డగా మామిడి కల్తీని పట్టుకున్న పోలీసులు
ఆరోగ్యానికి ప్రమాదకరమైన ఎథిలిన్ సాచెట్లను మామిడి కాయలపై పెట్టడం వల్ల అవి వేగంగా రంగు మారతాయి..
చూడగానే పసుపు పచ్చని… pic.twitter.com/4LjYrILFtZ
పచ్చిమామిడికాయలు పండినట్లు, అనేక వ్యాధులకు మూలం
పచ్చి మామిడికాయలపై క్యాల్షియ కార్బైట్ చల్లి అవి పండేటట్టు చేస్తున్నారు. నిజానికి కాల్షియం అనేది క్యాన్సర్ కారక పదార్థం, ఇది మనిషికి చాలా ప్రమాదకరమైనది, క్యాన్సర్‌కు కారణం కావచ్చు. వాస్తవానికి కార్బైడ్‌తో పండిన మామిడి పండ్లను తినడం మానుకోవాలి. మానవ శరీరంపై హానికరమైన వైద్య ప్రభావాల కారణంగా వైద్యులు ఈ మామిడిని నిషేధించారు. ఇలాంటి మామిడికాయలు చాలా హానికరం.
క్యాల్షియం కార్బైడ్‌తో పండిన మామిడికాయల వినియోగం నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. తలనొప్పి, తల తిరగడం, మూడ్ ఆటంకాలు, నిద్రలేమి, మానసిక గందరగోళం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, సెరిబ్రల్ ఎడెమా, మూర్ఛలకు కారణమవుతుంది.
