1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. ex minister, brs leader Malla Reddy Reacts On Party Change

నా వయసు 73 యేళ్లు - మునిగిపోయే పడవలో ఎవరైనా ఎక్కుతారా? మల్లారెడ్డి ప్రశ్న

mallareddy
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి పార్టీ మారబోతున్నట్టు విస్తృతంగా ప్రచారం సాగుతోంది. దీనిపై ఆయన స్పందించారు. ప్రస్తుతం నా వయసు 73 యేళ్ళు. ఏ నిర్ణయం ఎపుడు తీసుకోవాలో నాకు బాగా తెలుసు. మునిగిపోయే పడవలో ఎవరైనా ఎక్కుతారా? కాంగ్రెస్ పార్టీ ఒక మునిగిపోయే నావ. సీఎం రేవంత్ రెడ్డి 11 యేళ్ళు కాదు.. 50 యేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా ఆ పార్టీ మునిగిపోయే పడవనే అంటూ కాంగ్రెస్ పార్టీలో చేరికను మల్లారెడ్డి కొట్టిపారేశారు. పైగా, తన పెళ్లి రోజు వేడుకలకు ఆహ్వానించేందుకు సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని స్పష్టం చేశారు. 
 
ఇదిలావుంటే, మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆమె ప్రధాని మోడీ నాయకత్వాన్ని, కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలను ప్రశంసించడంతో పాటు హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మార్చాలన్ని బీజేపీ డిమాండ్‌ను సమర్థించారు. ఈ క్రమంలో మల్లారెడ్డి కుటుంబం కాంగ్రెస్ వైపు కాకుండా బీజేపీ వైపు చూస్తోందా అనే కొత్త చర్చ మొదలైంది. గతంలో ఆమె బీజేపీ అగ్రనేత బండి సంజయ్‍‌ను కలవడం కూడా ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. 
తర్వాతి కథనం
వైకాపా విధ్వంసంతో ఏపీ బ్రాండ్‌కు అపారనష్టం వాటిల్లింది : సీఎం చంద్రబాబు