సోమవారం, 9 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 3 మార్చి 2026 (16:15 IST)

కిలో టమోటా రూ. 4, కానీ మార్కెట్లో రూ. 15, ఏం చేద్దాం?

Tomatoes
టమోటా ధరలు దారుణంగా పడిపోయాయి. రైతుల వద్ద కిలో టమోటాను వ్యాపారులు కేవలం రూ. 4కే అడుగుతున్నారు. దీనితో పండించిన పంట గిట్టుబాటు ధరలు లేక రైతులు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు కిలో టమోటాలు రూ. 4కి కొనుగోలు చేసి వాటిని మార్కెట్లోకి వచ్చేసరికి రూ. 15కి అమ్ముతున్నారు. అటు రైతులను ఇటు ప్రజలను వ్యాపారులు కొల్లగొడుతుండటంపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 
 
టమోటాలను కోసేందుకు కూలీ, వాటిని రవాణా చేసేందుకు ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఇటు చూస్తే గిట్టుబాటు ధర రాకపోవడంతో చాలామంది రైతులు టమోటాలను కోయకుండా తోటల్లోనే వదిలేస్తున్నారు. మరికొందరు రైతులు వాటిని పశువులకు మేతగా వదిలేస్తున్నారు.