శనివారం, 14 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 ఫిబ్రవరి 2026 (16:33 IST)

అలియాబాద్‌లో ఏ పార్టీకిరాని మెజార్టీ.. చైర్మన్ పదవి ఇస్తేనే మద్దతంటున్న ఇండిపెండెంట్

vote
తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీలో ఓ విచిత్ర పరిస్థితి నెలకొంది. మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా, ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. మొత్తం 20 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 8, బీఆర్ఎస్ 7, బీఎస్పీ ఒక స్థానంలో విజయం సాధించగా, ఏడో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన గాదె వెంకటేశ్ విజయం సాధించారు. 
 
ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులోభాగంగా, స్వతంత్ర అభ్యర్థిని సంప్రదించగా, ఆయన చైర్మన్ పదవి ఇచ్చే పార్టీకే మద్దతు ఇస్తానని ప్రకటించారు. దీంతో ఏం చేయాలో ప్రధాన పార్టీల నేతలకు దిక్కుతోచడం లేదు. పైగా, గాదె వెంకటేశ్‌ను చుట్టుముట్టి మద్దతు ఇవ్వాలంటూ ప్రాధేయపడ్డారు. 
 
దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకుని అతనిని కౌంటింగ్ కేంద్రం నుంచి సురక్షితంగా తరలించారు. అలాగే, మరికొన్ని స్థానాల్లో కూడా ఏ ఒక్క పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాలేదు. దీంతో స్వతంత్రులు, ఇతర పార్టీల అభ్యర్థులతో మంతనాలు జరుపుతున్నాయి.