సంబంధిత వార్తలు
- Rental Girlfriend: ఢిల్లీలో ట్రెండ్ అవుతున్న రెంటల్ గర్ల్ ఫ్రెండ్ సేవలు
- మళ్లీ పెళ్లి చేసుకోనున్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్
- ప్రేయసిపై అనుమానం.. ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమికుడు
- ప్రియురాలితో పెళ్లి కోసం భారీ చోరీకి పాల్పడిన ప్రియుడు
- బ్రేకప్ చెప్పిందని ఆఫీసులోనే నిట్టనిలువునా కత్తితో పొడిచి చంపేసిన ప్రియుడు, వీడియో
ప్రియురాలికి వేరే యువకుడితో పెళ్లి జరుగుతోందని ఊరంతా తన లవ్ పోస్టర్లు అంటించాడు, వీడియో
జయం సినిమా గుర్తుండే వుంటుంది. అందులో హీరో నితిన్ కనబడకుండా స్లోగన్స్ రాసి విలన్ కి హీటెక్కిస్తాడు. ఇప్పుడు అలాగే ఓ ప్రియుడు తన ప్రియురాలికి వేరే వ్యక్తితో పెద్దలు ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని ఊరంతా తామిద్దరు కలిసి వున్న పోస్టర్లు అంటించాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో ఇతడి ప్రేమ వ్యవహారం కాస్తా పోస్టర్లతో సంచలనంగా మారింది.
తాము ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నామనీ, ఐతే తన ప్రియురాలి పేరెంట్స్ ఆమెకి ఇష్టం లేని పెళ్లిని బలవంతంగా చేస్తున్నారని అతడు ఆరోపిస్తున్నాడు. ఎంత చెప్పినా వినకపోయేసరికి అర్థరాత్రి తన ప్రియురాలితో తను కలిసి వున్న పోస్టర్లతో పాటు తన ప్రేయసిని పెళ్లాడేవాడు కేవలం బంగారం కోసం పెళ్లి చేసుకుంటున్నాడంటూ ఆరోపించాడు. ఇది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వరుడి ఊళ్లో ప్రియుడు వినూత్న నిరసన
— BIG TV Breaking News (@bigtvtelugu) July 8, 2026
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో ఓ ప్రేమ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్న యువతికి పెద్దలు బలవంతంగా వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయించడంతో, ఆమె ప్రియుడు అర్ధరాత్రి వినూత్న నిరసనకు దిగాడు. కేవలం బంగారం కోసమే వరుడు ఈ… pic.twitter.com/c0Ile0TIed
