ఆదివారం, 12 ఏప్రియల్ 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 12 మార్చి 2026 (22:24 IST)

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య టార్చర్ భరించలేక భర్త ఆత్మహత్య

Mental Depression
కర్టెసీ: జెమినీ ఏఐ ఫోటో
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య పెట్టే వేధింపులు తాళలేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాదులోని నేరేడ్‌మెట్‌లో జరిగింది. శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ నగరంలో స్థిరపడ్డాడు. 2012లో జ్యోతి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడు కూడా వున్నాడు. భార్య ఉన్నతి కోసం శ్రీనివాస్ కష్టపడ్డాడు. ఆమెను పోటీపరీక్షలకు సన్నద్ధం చేసాడు.
 
ఆమె అలాఅలా ఎక్సైజ్ సీఐ స్థాయికి ఎదిగింది. ఐతే ఉద్యోగం రాగానే భర్త శ్రీనివాస్‌ను దూరం పెడుతూ వచ్చింది. అదేమని అడిగినందుకు అతడిపై గృహహింస కేసుతో పాటు వరకట్న వేధింపుల కేసు కూడా పెట్టింది. విడాకులు కేసు కూడా పెట్టడంతో ఆమె నుంచి అతడు గత నాలుగు నెలలుగా దూరంగా వున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఇలా తనను వేధించడంతో అతడు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.