సినిమాల్లో నటించాలనే ఆశతో భాగ్యనగరికి వచ్చాడు.. అంతలోనే అనంతలోకాలకు... (వీడియో)
సినిమాల్లో నటించాలన్న ఆశతో ఓ యువకుడు హైదరాబాద్ నగరానికి వచ్చాడు. సినిమా అవకాశాల కోసం అనేక నిర్మాణ సంస్థలకు చెందిన కార్యాలయాలకు ఆడిషన్స్ కోసం వెళ్ళసాగాడు. ఇంతలోనే గుండె ఆగిపోవడంతో అనంత లోకాలకు చేరుకున్నాడు. ఈ విషాదకర ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సంజయ్ అనే కళాకారుడు సినిమాల్లో నటించాలన్న ఆశతో భాగ్యనగరికి వచ్చాడు. విద్యా నగర్‌లో ఉంటూ ఆడిషన్స్ కోసం తన వంతు ప్రయత్నాలు ప్రారంభించాడు. బంజారా హిల్స్ సాగర్ సొసైటీలోని ఓ సినిమా ఆఫీసుకు వెళ్లిన సంజయ్... ఆడిషన్స్ పూర్తయ్యాయని నిర్వాహకులు చెప్పడంతో తీవ్ర నిరాశకు లోనయ్యాడు.
అయితే, తనకు ఒక్క అవకాశం ఇవ్వాలంటూ పదేపదే ప్రాధేయపడ్డాడు. కానీ, ఆడిషన్స్ ముగిసిపోయాయని, అవకాశాలు లేవంటూ నిర్వాహకులు చెప్పారు. దీంతో నిరాశకు లోనైన సంజయ్ కుర్చీలో కూర్చొన్న కొద్దిసేపటికే గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సినిమాల్లో నటించాలనే ఆశతో హైదరాబాద్కు..అంతలోనే విషాదం
— BIG TV Breaking News (@bigtvtelugu) April 2, 2026
గుండెపోటుతో కళాకారుడు మృతి
విద్యానగర్లో ఉంటూ ఆడిషన్స్ కోసం ప్రయత్నాలు
బంజారాహిల్స్ సాగర్ సొసైటీలోని ఓ సినిమా ఆఫీసుకు వెళ్లిన సంజయ్
ఆడిషన్స్ పూర్తయ్యాయని నిర్వాహకులు చెప్పడంతో నిరాశ
ఒక్క అవకాశం ఇవ్వాలని వేడుకున్న… pic.twitter.com/4kGNAmPbmM
