1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. HYDRAA officials holds final demolition to Fatima Owaisi college buildings

చెరువులో కాలేజీ కట్టిన ఓవైసీ... కూల్చే దమ్ములేక పారిపోయిన హైడ్రా అధికారులు

salkam cheruvu
హైదరాబాద్ నగరంలో ఆక్రమణల తొలగింపు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా అనే స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేసి డైరెక్టరుగా రంగనాథ్‌ను నియమించింది. ఆయన విధులు చేపట్టినప్పటి నుంచి హైదరాబాద్ నగరంలోని ఆక్రమణలను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు. ఈ క్రమంలో పలు చెరువులను ఆక్రమించి కట్టిన భవనాలను కూడా రాత్రికి రాత్రే కూల్చివేశారు. అనేక వందల పేదల గృహాలను తొలగించారు. దీంతో హైడ్రా పనితీరు తీవ్ర వివాదాస్పదమైంది. 
 
ఈ నేపథ్యంలో ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సలకం చెరువును ఆక్రమించుకుని ఫాతివా ఓవైసీ మహిళా కాలేజీని నిర్మించారు. దీన్ని తొలగించేందుకు హైడ్రా అధికారులు కాలేజీ వద్దకు చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎంఐఎం నేతలు అక్కడకు చేరుకుని అధికారులపై మండిపడ్డారు. చల్ హాట్ అనగానే అక్కడ నుంచి పలాయనం చిత్తగించారు. పైగా, కేసు నమోదు చేశామని అధికారులు పోలీసులు చెబుతున్నారు. 
 
అయితే, హైదరాబాద్ వాసులు మాత్రం హైడ్రా అధికారుల తీరుపై మండిపడుతున్నారు. పోలీసులు కేసు పెడితే ఎంత త్వరగా పరిష్కారమవుతుందో అందరికీ తెలుసంటూ ఎద్దేవా చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే నిస్సహాయ ప్రజల ఆస్తులు కూల్చినట్టే ఎంఐఎం ఆస్తులను కూడా కూల్చాలని, లేదంటే ఎన్నికల్లో బీజేపీకి సీట్లు వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలని స్థానికులు అంటున్నారు. 
About Writer
సెల్వీ
తర్వాతి కథనం
నారీ శక్తి వందన్‌కు మద్దతు ఇవ్వండి : టీడీపీ ఎంపీలకు సీఎం చంద్రబాబు లేఖ