పవన్ సారీ చెప్తే ఆయన సినిమాలు ఒకట్రెండు రోజులు ఆడుతాయి, లేదంటే అంతే: కోమటిరెడ్డి (video)
తెలంగాణ విడిపోయి 13 ఏళ్లు కావస్తోంది. అట్లాంటిది ఇప్పుడు ఏపీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణపై అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేసారో తనకైతే అర్థం కావడంలేదని తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పవన్ కళ్యాణ్ గారు తెలిసి అన్నారో తెలియక అన్నారో కానీ ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని భేషరుతు క్షమాపణలు చెప్పాలి. సారీ చెబితే ఆయన సినిమాలు తెలంగాణలో ఒకట్రెండు రోజులు ఆడుతాయి. చెప్పకపోతే ఒక్క షో కూడా పడదు అంటూ హెచ్చరించారు.
కాగా ఇటీవల కోనసీమలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తన పర్యటన సందర్భంగా, ఉప్పునీటి చేరిక, సముద్ర మట్టాలు పెరగడం వల్ల కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాటల సందర్భంలో కోనసీమ అందంపై దిష్టి పడిందని అన్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజనకు కోనసీమ ప్రాంతం అందమైన పచ్చదనం కూడా ఒక కారణమని, తెలంగాణ నాయకులు ఆ ప్రాంతంకు దిష్టి పెట్టారని అన్నారు. దీనిపై తెలంగాణ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.