శనివారం, 15 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 14 నవంబరు 2025 (18:32 IST)

Jubilihills: అమెరికాలో బాత్రూంలు కడిగిన సన్నాసికేం తెలుసు?: నవీన్ యాదవ్ తండ్రి కామెంట్స్

Srisailam Yadav
ఎన్నికల విజయానందం పొందేవారు ఎంతో అణిగిమణిగి వుండాలంటారు. ఓడినవారు సహజంగా బాధలో ఏదో ఒకటి నోరు జారుతారు. కానీ విజయం సాధించిన వారు ఎంతో సంయమనంతో వుండాలి. అట్లాంటిది జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో అలా కాంగ్రెస్ విజయం సాధించిందో లేదో ఇలా ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ దారుణమైన వ్యాఖ్యలు చేసారు.
 
ఆయన మీడియా వారితో మాట్లాడుతూ... హైదరాబాద్ అంటేనే పహిల్వాన్, అమెరికాలో బాత్రూం కడిగిన సన్నాసికి పహిల్వాన్, రౌడీయిజానికి తేడా ఏం తెలుసంటూ వ్యాఖ్యానించారు.
 
ఈ వ్యాఖ్యలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనితో గెలిచి కొన్ని గంటలు కూడా కాకముందే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఇక మున్ముందు ఏం చేస్తారో అంటూ నెటిజన్లు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. రెండేళ్ల తర్వాత వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ ఓడించక్కర్లేదు... ఆ పార్టీకి చెందినవారే చక్కగా ఓడగొట్టి అధికారాన్ని విపక్షం చేతుల్లో పెడతారంటూ సెటైర్లు వేస్తున్నారు పలువురు.