వడ్డేపల్లి మున్సిపాలిటీ గెలుపుతో కవితకు సంబంధం లేదు : ఇండియా ఫార్వర్డ్ బ్లాక్
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మద్దతు పలికిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. మొత్తం 10 వార్డులకుగాను 8 వార్డుల్లో సింహం గుర్తుపై గెలిచి సంచలనం సృష్టించారు. ఈ గెలుపు చర్చనీయాంశంగా మారుతున్న వేళ, కవిత విజయం గురించి చర్చ ప్రారంభమైన వేళ ఆమెకు గట్టి షాక్ తగిలింది.
తమ విజయంతో కవితకు ఎలాంటి సంబంధం లేదని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి బీఫారం తీసుకోవడానికి వెళ్లినపుడు కవిత తమకు జాగృతి కండువా కప్పారని, కానీ, ఆమె తమ తరపున ప్రచారానికి వచ్చిందే లేదని చెప్పారు. ప్రచారంలో తాము కమిత కండువా వేసుకున్నది కూడా లేదని, ఆ రోజు తర్వాత కవితతో తాము మాట్లాడింది కూడా లేదని తెలిపారు. ఈ గెలుపు తమ సొంతమని ఆయన చెప్పారు. అయితే, శ్రీనివాస్ వ్యాఖ్యలపై కవిత ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సివుంది.