'కరీంనగర్ పిల్లా 143' పేరుతో భార్యాభర్తల గలీజ్ దందా ... ఎక్కడ?
తెలంగాణ రాష్ట్రానికి చెందిన భార్యాభర్తలు గలీజ్ దందాకు పాల్పడి, చివరకు జైలు ఊచలు లెక్కిస్తున్నారు. 'కరీంనగర్ పిల్లా 143' పేరుతో ఓ యూట్యూబ్ చానెల్ ప్రారంభించి, తద్వారా ఏకంగా 100 మంది పురుషులతో ఓ మహిళ వ్యభిచారం చేసింది. భార్య చేసే వ్యభిచారానికి కట్టుకున్న భర్త పూర్తి సహాయ సహకారాలు అందించడం గమనార్హం.
పైగా, తన భార్య విటులతో ఏకాంతంగా గడుపుతున్న దృశ్యాలను వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు. అలా ఏకంగా కోటి రూపాయల వరకు విటుల నుంచి ఈ భార్యాభర్తలు కొల్లగొట్టారు. ఈ డబ్బుతో రూ.65 లక్షలు విలువ చేసే ఫ్లాట్, రూ.10 లక్షలకు లగ్జరీ ఫర్నీచర్‌ను కొనుగోలు చేశారు.
కరీంనగర్ జిల్లాలోని ఆరేపల్లిలో భార్యాభర్తలు ఉన్నారు. అయితే, భర్త పీకల్లోతు అప్పుల ఊబిలో కూరుకునిపోయాడు. వీటి నుంచి బయటపడేందుకు ఈ దంపతులు గలీజ్ దందాకు దిగారు.'లాలీడింపుల్ క్వీన్' పేరుతో ఇన్‌స్టాఖాతాను, 'కరీంనగర్ పిల్లా 143' పేరుతో యూట్యూబ్ చానెల్‌లు ప్రారంభించి, వీటి ద్వారా పురుషులకు వల వేశారు. ఈ వలలో చిక్కుకున్న వారిని తమ ఇంటికి రప్పించి, వారితో ఆ మహిళ శృంగారంలో పాల్గొనేది. ఆ సమయంలో భర్త వీడియోలు తీసి వారిని బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు దండుకునేవారు.
ఇలా సంపాదించిన డబ్బుతో ఆరేపల్లిలో రూ.65 లక్షలతో ఒక ఫ్లాట్, ఖరీదైన ఫర్నీచర్, రూ.10 లక్షలతో కారును కొనుగోలు చేశారు. అయితే, కరీంనగర్‌కు చెందిన ఓ లారీ వ్యాపారిని బ్లాక్ మెయిల్ చేసి రూ.15 లక్షలు వసూలు చేశారు. ఆ తర్వాత మరో రూ.5 లక్షలు కావాలంటూ బెదిరించారు. డబ్బులు ఇవ్వకుంటే హత్య చేస్తామని, సెక్స్ వీడియోలు బహిర్గతం చేస్తామంటూ బెదిరించారు.
దీంతో ఆ వ్యాపారి పోలీసులను ఆశ్రయించడంతో గలీజ్ దంపతుల గుట్టు వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఈ దంపతులను అరెస్టు చేసి, రికార్డు చేసిన వీడియోలు, నగదు, చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. తన భర్త సహకారంతో ఆ మహిళ ఏకంగా 100 మందితో అక్రమ సంబంధం పెట్టుకోగా, మరో 1500 మందిని ట్రాప్ చేసింది.