సంబంధిత వార్తలు
- పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ దాటబోయింది... ఇంతలోనే వేగంగా రైలు, వీడియో
- చెన్నై-హౌరా రైలు కింద పడి ఇద్దరు స్నేహితుల ఆత్మహత్య
- మానసికస్థితి సరిగాలేని టెక్కీ రైలు పట్టాలపై పడుకున్నాడు.. తల మొండెం వేరయ్యాయి...
- హైదరాబాద్‌లో విషాద ఘటన - రైలు కిందపడి ముగ్గురు కుటుంబ సభ్యులు సూసైడ్
- భద్రాద్రి రైల్వే స్టేషనులో బాంబు సంచిని కొరికిన కుక్క, పేలిపోయి ట్రాక్ మీద పడింది
వీడియో కాల్ చేసి.. లైవ్‌లో రైలు కింద పడి ఆత్మహత్య
Kazipet Man
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు మరియు స్థానికుల కథనం ప్రకారం.. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తిని వరంగల్ ప్రాంతానికి చెందిన డాక్యుమెంట్ రైటర్ రాజేష్ నాయక్ (45) గా గుర్తించారు.
గత కొంతకాలంగా రాజేష్ నాయక్ కుటుంబంలో ఆస్తి పంపకాల విషయమై తీవ్రస్థాయిలో మనస్పర్థలు, ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఈ వ్యవహారం సర్దుమణగకపోవడంతో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇదే క్రమంలో ఆదివారం రాత్రి కూడా ఆస్తి పంపకాల విషయమై భార్యతో రాజేష్ నాయక్‌కు తీవ్ర వాగ్వాదం జరిగింది.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన ఆగ్రహంతో ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయిన రాజేష్.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు.
