సంబంధిత వార్తలు
- July 07, 2026: తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?
- పచ్చి కోడిగుడ్లతో మయోన్నైస్ ఉత్పత్తి.. నిబంధనల ఉల్లంఘనపై సీరియస్
- 'ప్రశ్న' రావణ్ మొబైల్ ఫోనులో మావోయిస్టులను కీర్తిస్తూ ప్రసంగాలు
- హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు.. ఎలా?
- Monsoon fury: దేశంలో కురిసిన భారీ వర్షాలు.. 45 శాతం నుండి 28కి తగ్గిన వర్షపాత లోటు
బాలిక నోట్లో పెన్ క్యాప్ పెట్టి నీళ్లు పోసిన సాటి విద్యార్థినిలు... తర్వాత ఏం జరిగింది?
తెలంగాణ రాష్ట్రంలోని కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలంలోని దరిగాం రోడ్డులో ఉన్న మహాత్మా జ్యోతిబాఫులే (ఎంజేపీ) బాలికల గురుకుల విద్యాలయంలో ఓ దారుణం జరిగింది. పదో తరగతి విద్యార్థినిపై తోటి విద్యార్థులు దాష్టీకం ప్రదర్శించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను బాధిత బాలిక తండ్రి వెల్లడించారు.
గత శనివారం రాత్రి సహచర విద్యార్థినులు తన కుమార్తె కళ్లకు గంతలు కట్టి కాళ్లు, చేతులు బిగిసిపట్టి నోట్లో పెన్ను క్యాప్‌ను వేసి నీళ్లు పోశారు. దీంతో క్యాప్‌ను మింగేసిన విద్యార్థిని ఆ విషయాన్ని విద్యాలయం సిబ్బందికి తెలిపింది.
వారు తండ్రికి సమాచారం ఇవ్వగా.. ఆయన ఆదివారం ఉదయం వచ్చి తన కుమార్తెను మంచిర్యాలలోని ఓ ఆసుపత్రికి తరలించారు. స్కానింగ్ చేయగా కడుపులో క్యాప్ ఉన్నట్లు గుర్తించిన వైద్యులు.. చికిత్స చేసి దాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై అమ్మాయి తండ్రి సోమవారం కాగజ్‌నగర్ గ్రామీణ ఠాణాలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
