1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Let-s let men sit in the seats reserved for them: Message and video from TGRTC

పురుషులకు కేటాయించిన సీట్లలో వారిని కూర్చోనిద్దాం: TGRTCలో సందేశం, వీడియో

TGRTC seats for men
తెలంగాణకు చెందిన ఓ యువతి పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అందులో వున్న సందేశం ఏమిటంటే.... పురుషులను గౌరవించడం మన సంప్రదాయం. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాము... అని బస్సులో డ్రైవర్ సీటు వెనుక రాసి వున్నది. ఇదివరకూ...స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం.
 
వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాము అని వుండేది. దాని స్థానంలో ఇలా వుండటం ఒకింత ఆశ్చర్యం కలుగవచ్చు. కానీ స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించిన దగ్గర్నుంచి పురుషుల సీట్లను కూడా స్త్రీలు ఆక్రమించేస్తున్నారు. దీనితో తెలంగాణ ఆర్టీసి ఇలా రాయాల్సి వచ్చిందని అంటున్నారు.
About Writer
ఐవీఆర్
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలలో పనిచేసారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
Kamareddy: వరద నీటిలో చిక్కుకుపోయిన ప్రైవేట్ బస్సు.. 45మందికి ఏమైందంటే? (video)