సోమవారం, 16 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 19 ఫిబ్రవరి 2026 (10:16 IST)

త్వరలో తెలంగాణ మహిళలకు మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు

Buses
రెండు తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాలను ఆయా ప్రభుత్వాలు కల్పించాయి. తెలంగాణలో మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణించేందుకు వీలుగా వారి కోసం మహాలక్ష్మి స్మార్ట్ కార్డుల పేరిట త్వరలో జారీ చేయనున్నారు. ఈ కార్డులను మహిళలకు అందిస్తారు. బస్సులో ప్రయాణం చేసేటపుడు కార్డు చూపిస్తే చాలు. రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ ఈమేరకు మోడల్ కార్డులను పరిశీలించి రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కతో సమావేశమై ఫైనల్ చేయనున్నారు. 
 
జైలు జీవితాన్ని బాగా ఎంజాయ్ చేసా
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును దూషించిన కేసులో అరెస్టయిన వైకాపా నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన బుధవారం రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబుపై నమోదైన 36 కేసుల్లో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 
 
అలాగే, పోలీస్ విధులకు ఆటంకాలు, వివిధ వివాదాలపై మరో 16 కేసులు నమోదైవున్నాయి. ఈ కేసుల్లో కూడా ఆయనకు బెయిల్ మంజూరైంది. అలాగే, గత వైకాపా ప్రభుత్వంలో సత్తెనపల్లి నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల పేరుతో నిర్వహించిన లక్కీ డ్రా అవినీతి కేసులో కూడా ఆయనకు బెయిల్ మంజూరైంది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. 
 
ఆ తర్వాత ఆయన జైలు బయట విలేకరులతో మాట్లాడుతూ, జైలు జీవితాన్ని ఎంజాయ్ చేసినట్టు చెప్పారు. జైలులో పెడితే భయపడతానని అనుకున్నారేమో... అలాంటి ప్రసక్తే లేదన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రోజులు జైలులో ఉన్నా ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. జగన్ నాయకత్వంలో టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కూల్చేంతవరకు తన పోరాటం ఆగదన్నారు. పైగా, రాజమండ్రి కేంద్ర కారాగారం తనలో పట్టుదలను పెంచిన శిక్షణా కేంద్రమన్నారు.