1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Meet Hyderabad's food man who has fed hundreds outside government hospital daily for over 10 years

కార్పొరేట్ జాబ్ చేస్తూ ఫుడ్ మ్యాన్‌గా మారిన వ్యక్తి.. రోజుకు వందలాది మందికి భోజనం (వీడియో)

Hyderabad food man
Hyderabad food man
కార్పొరేట్ ఉద్యోగం చేస్తూ హ్యాపీగా వుండేపోయే వారు చాలామంది వున్నారు. అందులో ఫుడ్ మ్యాన్ మాత్రం కాస్త వేరేలా యోచించాడు. ఉద్యోగం చేస్తూనే వందలమందికి అన్నదానం చేస్తున్నాడు. హైదరాబాద్ ఫుడ్ మ్యాన్‌గా పిలువబడే ఈయన, తన కార్పొరేట్ ఉద్యోగానికి వెళ్లే ముందు ప్రతి ఉదయం 200 నుండి 400 మందికి ఉచితంగా పౌష్టికాహారాన్ని వండి వడ్డిస్తుంటారు. 
 
గత 10 ఏళ్లుగా ఆయన ఈ సేవను కొనసాగిస్తున్నట్లు సమాచారం. తాజాగా ఈ ఫుడ్ మ్యాన్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, ఆయన తాజాగా వండిన అన్నం, కూరలను వడ్డిస్తుండగా ప్రజలు బారులు తీరి నిలబడటం కనిపిస్తుంది. 
 
రోగుల సహాయకులు, వృద్ధులు, మహిళలు, సెక్యూరిటీ గార్డులు, ఇతర అవసరంలో ఉన్నవారికి ఈ భోజనం అందిస్తారు. ఆసుపత్రిలో చికిత్స కోసం రోజుల తరబడి ఉండాల్సి రావచ్చు. అటువంటి సమయంలో ప్రతిరోజూ ఆస్పత్రి బయట ఆహారం కొనడం ఖర్చుతో కూడుకున్న పని. అందుకే ఆయన ఆస్పత్రికి సమీపంలో ఉచిత ఆహారాన్ని అందిస్తున్నారు. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన అదరగొడుతుంది.. పోలవరం ఎమ్మెల్యే