ఆదివారం, 12 ఏప్రియల్ 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 13 మార్చి 2026 (23:18 IST)

తెలంగాణ రైతుల కోసం ఆధునిక వ్యవసాయ సాంకేతికతలను ప్రదర్శించిన మెగా రైతు మేళా 2026

image
హైదరాబాద్: భారతదేశంలోని ప్రముఖ అగ్రి-సొల్యూషన్స్ సంస్థ అయిన కోరోమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం(PJTAU), తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖతో భాగస్వామ్యంగా, హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉన్న PJTAU క్యాంపస్‌లో మెగా రైతు మేళా 2026ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 5000 మందికి పైగా రైతులు, శాస్త్రవేత్తలు, విధాన నిర్ణేతలు, పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంచే వినూత్న సాంకేతిక, సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రదర్శించారు.
 
ఈ కార్యక్రమానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖల గౌరవమంత్రివర్యులు శ్రీమతి డి. అనసూయ సీతక్క, వ్యవసాయం, మార్కెటింగ్, సహకారం, హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ శాఖల గౌరవ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖల గౌరవ మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్- సీఈఓ శ్రీ శంకర సుబ్రమణియన్ ఎస్, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి(ICAR) డైరెక్టర్ జనరల్ డా. మంగి లాల్ జాట్, PJTAU వైస్-చాన్సలర్, చైర్మన్ ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య హాజరయ్యారు.
 
ఈ రైతు మేళా, రైతులు వ్యవసాయ నిపుణులతో నేరుగా చర్చించేందుకు, పంట పోషణ, పంట సంరక్షణ, విత్తనాలు, ప్రెసిషన్ వ్యవసాయం, వ్యవసాయ యాంత్రీకరణలో తాజా అభివృద్ధులను తెలుసుకునేందుకు ఒక చురుకైన వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమంలో సాంకేతిక ప్రదర్శనలు, క్షేత్ర స్థాయి డెమోన్స్ట్రేషన్లు, సమతుల్య ఎరువుల వినియోగం, నేల ఆరోగ్య నిర్వహణ, వాతావరణ మార్పులకు తట్టుకునే వ్యవసాయంపై నిపుణుల సమావేశాలు నిర్వహించబడ్డాయి.
 
ఈ కార్యక్రమంలోని ముఖ్య ఆకర్షణల్లో ఒకటైన డ్రోన్ స్ప్రేయింగ్, ప్రెసిషన్ వ్యవసాయ సాంకేతికలు, వ్యవసాయంలో డిజిటల్, యాంత్రీకరణ   ప్రాముఖ్యతను చూపిస్తూ, వ్యవసాయ పనుల్లో కార్మికుల కొరత సమస్యను అధిగమించడంలో, వ్యవసాయ సామర్థ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. రైతులకు క్షేత్ర స్థాయిలో నిర్వహించిన ప్రత్యక్ష పంట ప్రదర్శనలో ఆర్గానిక్ ఇన్‌పుట్స్, కాంప్లెక్స్ ఎరువులు, నానో ప్రత్యేక పోషకాల వినియోగంతో సమగ్ర పంట పోషణ పద్ధతులను చూపించారు. ఈ ప్రదర్శనలు సమతుల్య పంట పోషణ ద్వారా రైతులు ఉత్తమ వ్యవసాయ పద్ధతులను అనుసరించడానికి, అధిక దిగుబడులు పొందటానికి సహాయపడతాయి.
 
ఈ కార్యక్రమం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించబడింది. మహిళా రైతుల కృషిని గుర్తించి, గ్రామీణ మహిళలు, యువత కొత్తగా వస్తున్న అగ్రి-ఎంట్రప్రెన్యూర్ అవకాశాలలో, ముఖ్యంగా డ్రోన్ ఆధారిత సేవలలో పాల్గొనేలా ప్రోత్సహించడంపై ప్రత్యేక దృష్టి సారించబడింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కోరోమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్- సీఈఓ శ్రీ సంకరసుబ్రమణియన్ ఎస్ ఇలా అన్నారు.
 
తెలంగాణ రాష్ట్రం బలమైన ప్రభుత్వ విధానాలు, రైతు కేంద్రిత కార్యక్రమాల ద్వారా వ్యవసాయాన్ని ఉత్సాహభరితమైన, లాభదాయక రంగంగా ఎలా మార్చవచ్చో చూపిస్తోంది. ఈ రాష్ట్రంలోని రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను స్వీకరించడంలో ఎప్పుడూ ముందుంటున్నారు. రైతు మేళా వంటి వేదికలు సమతుల్య పోషణ, డ్రోన్లు, నానో సాంకేతికతలు, రోబోటిక్స్ వంటి సుస్థిర వ్యవసాయ పరిష్కారాలపై అవగాహన పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కోరోమాండల్‌ రైతు సమాజంతో భాగస్వామ్యంగా పనిచేస్తూ, ఉత్పాదకతను పెంచడం, రైతుల ఆదాయాన్ని బలోపేతం చేయడం, మరింత స్థిరమైన వ్యవసాయ పర్యావరణాన్ని నిర్మించడానికి కట్టుబడి ఉంటుంది.