సంబంధిత వార్తలు
- భార్యను ఇంటిలో నిర్బంధించి.. తిండి పెట్టకుండా అస్థిపంజరంలా మార్చి హత్య!
- తెలంగాణాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు
- తెలుగు చిత్రపరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ధ్యేయం : సీఎం రేవంత్ రెడ్డి
- బాలికను ఆటోలో తీసుకెళ్లి అత్యాచారం... ఎక్కడ?
భద్రాచలంలో దారుణం- ఆటోలో ఎక్కిన 17ఏళ్ల బాలికపై మత్తు మందిచ్చి?
భద్రాచలంలో దారుణం చోటుచేసుకుంది. 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది. బాధితురాలు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గిరిజన మహిళగా పోలీసులు గుర్తించారు.
వివరాల్లోకి వెళ్తే.. ఆ బాలిక తన బంధువుల ఇంటికి వెళ్లేందుకు శనివారం సాయంత్రం చర్ల మండల కేంద్రానికి వచ్చింది. అక్కడ వాజేడు ప్రాంతానికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. ఆ సమయంలోనే ఆటోలో ఉన్న ఇతర డ్రైవర్లు ఆమెకు కూల్‌డ్రింగ్‌లో మత్తుమందు కలిపి ఇచ్చారు.
ఆపై వారు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. స్థానికులు బాధితురాలిని సంరక్షణ కేంద్రానికి తరలించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు. ఆ బాలిక శరీరంపై పంటిగాట్లు, గాయాలు ఉన్నాయని గుర్తించి అత్యాచారం కేసు చేశారు.
