వాహనాలపై పిల్లల్ని తీసుకెళ్లే తల్లిదండ్రులూ, జాగ్రత్త: సజ్జనార్ ఐపీఎస్ సూచనలు
ఉదయాన్నే పాఠాశాలలకు పిల్లల్ని తీసుకుని వారి తల్లిదండ్రులు ఎంతో హడావుడిగా వెళ్తుంటారు. వారిని స్కూలు గేటు వద్ద దించేస్తుంటారు. ఐతే ఈ తొందరపాటులో వాహనాన్ని ఆపకుండానే పిల్లల్ని కిందకు దించుతున్నప్పుడు వారు పొరబాటును యాక్సెలరేటర్ పైన చేయి పెట్టారంటే ప్రమాదం జరుగుతుంది. దీని గురించి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ వి.సి సజ్జనార్ ప్రజలకు అవగాహన కల్పించేందుకు వాస్తవంగా జరిగిన ఓ ఘటన వీడియోను షేర్ చేసారు. అందులో ఆయన పేర్కొంటూ... స్కూటీ ముందు భాగంలో పిల్లలను నిల్చోబెడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త!
వాహనం ఆపినప్పుడు లేదా పిల్లలు దిగుతున్నప్పుడు పొరపాటున వారు యాక్సిలరేటర్ తిప్పితే ప్రాణాలకే ప్రమాదం. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ ఇటీవల జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. చిన్న అజాగ్రత్త పెద్ద అనర్థానికి దారితీయొచ్చు. తల్లిదండ్రులూ.. దయచేసి గమనించండి.
బండి ఆపగానే ఇగ్నిషన్ ఆఫ్ చేసి, తాళం (Key) తీసేయండి.
పిల్లలు బండి దిగేటప్పుడు బ్రేక్ గట్టిగా పట్టుకోండి.
ఇంజిన్ కిల్ స్విచ్ వాడటం అలవాటు చేసుకోండి.
మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది. గమనించండి.. ఇతరులకూ తెలియజేయండి.